అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడి కన్నుమూత
posted on Feb 12, 2025 10:07AM

ఆయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(87) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఆయన ఆదివారం లక్నోలోని ఎసీపీజీటీలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ బుధవారం (ఫిబ్రవరి 12) తుదిశ్వాస విడిచారు.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహ రించారు. సత్యేంద్ర దాస్ 34 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమిలో ప్రధాన పూజారిగా పనిచే స్తున్నారు. ఆయన 1945 మే 20న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు.
ప్రస్తుతం ఆయన వయస్సు 80 ఏళ్లు. సత్యేంద్ర దాస్ తన గురువు అభిరామ్ దాస్ జీ ప్రభావంతో 1958లో అంటే 13 ఏళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించారు. అప్పటి నుంచీ ఆయన తన ఇంటిని వదిలి ఆశ్రమంలో నివసించారు. సత్యేంద్రదాస్ మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.