Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పైజమాతో పార్లమెంటుకి
posted on: Mar 18, 2016 5:33PM

ఒంటి మీద పైజమా, చేతిలో దిండు... ప్రపంచంలో ఎవరైనా ఇలా పార్లమెంటులోకి అడుగుపెట్టగలరా! ఆస్ట్రేలియాలో మాత్రం ఇది సాధ్యమేనని నిరూపించారు. ఎన్నికల సంస్కరణలకి సంబంధించి అక్కడి పార్లెమెంటులో జరుగుతున్న ఓ చర్చ సందర్భంగా ‘నిక్ సెనఫోన్’ అనే సభ్యుడు, కోతిబొమ్మలు ఉన్న పైజమా ధరించి పార్లమెంటులోకి ప్రవేశించాడు. ఈ ఘోరం చూడలేని పార్లమెంటు సిబ్బంది ఆయనను దుస్తులు మార్చుకోవలసిందిగా కోరారు. దాదాపు 40 గంటల పాటు జరిగిన సదీర్ఘ చర్చలో ఇలాంటి చిత్రాలెన్నో అక్కడి పార్లమెంటులో చోటు చేసుకున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఉన్న చిన్నపాటి లోటుపాట్ల వల్ల, చట్టసభలోకి ఎవరు పడితే వారు ప్రవేశించగలుగుతున్నారనీ, దీన్ని నివారించేందుకు ఓటింగ్ ప్రక్రియలో తగిన మార్పులు తీసుకురావాలని ఈ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ సభ్యులు, ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మన దేశ నేతలు సైతం సిగ్గుపడే విధంగా, వీరు నానాతిట్లూ తిట్టుకున్నారు. ఎట్టకేలకు, ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన ఈ బిల్లుని సమర్థంగా నెగ్గించుకోగలిగింది. 40 గంటల పాటు చర్చ జరిగిన తరువాత, ఇక బిల్లుని వ్యతిరేకించే ఓపిక ఎవరికీ లేకపోయింది.






