అహంకారానికి పరాభవం!
posted on: Feb 18, 2026 2:05PM
.webp)
టి20 వరల్డ్ కప్ టోర్నీ.. లీగ్ దశలోనే ఆస్ట్రేలియా ఔట్!
ఎన్నాళ్లకెన్నేళ్లకూ..టి20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా జటర్టు లీగ్ దశలోనే చేతులెత్తేసింది. ఆ వార్త భారత్ లో క్రికెట్ అభిమానులను ఆనందడోలికల్లో ముంచేసిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 2023 వండే వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియాను ఓడించి చాంపియన్ గా నిలిచి కప్ ను ముద్దాడింది. ఏ ఆటలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం ఆ విజయం తలకెక్కేసింది. అహంకారంతో ఆసీస్ జట్టు విర్రవీగింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ప్రజంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లు పఅప్పట్లో హద్దు మీరి ప్రవర్తించింది.
ఈ సమయంలో వారు ఈ ప్రపంచ క్రికెట్ తమ పాదాల కింద అన్న అర్ధమొచ్చేలా.. వ్యవహరిచారు. వరల్డ్ కప్ ను కాళ్ల వద్ద ఉంచుకుని విర్రవీగారు. ఆ అహంకారం అప్పట్లోనే అందరిలో ఆగ్రహాన్ని పింపాయి. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా అన్ని టోర్నీలూ కలిపి మొత్తం పది 10 ఐసీసీ కప్పులను గెలిచింది. వీటిలో ఆరు సార్లు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇక టి20 వరల్డ్ కప్ ను ఒక్కసారి గెలుచుకుంది. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ను సైతం గెలుచుకుని క్రికెట్ లోని మూడు ఫార్మాట్ లలోనూ వరల్డ్ కప్ గెలుచుకున్న తొలి జట్టుగా రికార్డులకు ఎక్కింది.
అటువంటి ఆస్ట్రేలియా జట్టు టి20 వరల్డ్ కప్ 2026లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. విజయాలను నెత్తికెక్కించుకుని అహంకారంతో విర్రవీగిన ఆసీస్ కు మంచి పరాభవమే ఎదురైందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఎందు కంటే గత 17 ఏళ్లలో ఒక ఐసీపీ టోర్నీ నుంచి కనీసం నాకౌట్ కు కూడా చేరకుండా ఆస్ట్రేలియా జట్టు పిష్క్రమించడం ఇదే తొలిసారి.






