Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్ యత్నం.. యువకుడి అరెస్టు
posted on: May 11, 2026 10:17AM
.webp)
వికారాబాద్ జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక అపహరణ యత్నం కేసుకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అరెరస్టు చేశారు. ప్రేమ పేరుతో 16 ఏళ్ల బాలికను మాయమాటలతో ట్రాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీకి చెందిన ఆదీమ్ అనే 28 ఏళ్ల యువకులు.. కొంతకాలం క్రితం పనిమీద తాండూరు పట్టణానికి వచ్చాడు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఢిల్లీ సెలూన్ షాపులో గత ఆరు నెలలుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కున్నాడు. ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటాననీ నమ్మించి బాలికను తనతో రావడానికి ఒప్పించాడు.
శనివారం (మే 9) బాలికను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన ఆదీమ్.. ముందుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలు ద్వారా ఢిల్లీ కి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు తాండూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో బాలిక మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేసి హైదరాబాద్‌లో నిందితుడి కదలికలను గుర్తించారు. వెంటనే ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఆదీమ్‌ను అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. అనంతరం వారిని తాండూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై స్పందించిన తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, మైనర్ బాలికను అపహరించేందుకు యత్నించిన కేసు నిందితుడిపై నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించి, కౌన్సెలింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది.






