Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒమన్ జలాల్లో భారత నౌకపై దాడి.. సిబ్బంది సురక్షితం
posted on: May 15, 2026 9:43AM

ఒమన్ జలాల్లో భారత నౌక హాజీ అలీ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆ నౌక మునిగిపోయింది. కాగానౌకలోని 14 మంది సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు ఉన్నారు. వాణిజ్య నౌకలపై జరిగిన ఈ దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్రం పేర్కొంది. హాజీ అలీ నౌక సోమాలియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాకు వెళ్తుండగా బుధవారం ( మే 13) తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఈ దాడితో నౌకలో మంటలు చెలరేగి సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. వెంటనే స్పందించిన ఒమన్ కోస్ట్ గార్డ్ నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించి సమీపంలోని పోర్టుకు తరలించారు.
ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం సరికాదని పేర్కొంది. స్వేచ్ఛా వాణిజ్యం, నౌకాయానానికి ఆటంకం కలిగించవద్దని హెచ్చరించింది. ప్రకటనలో పేర్కొంది.






