గుజరాత్ జైల్లో టెర్రరిస్టుపై ఖైదీల దాడి

గుజరాత్ జైల్లో ఉన్న టెర్రరిస్టు అహ్మద్ మొహియిద్దీన్  సయ్యద్ పై ఖైదీలు దాడి చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి విదితమే.  ఐఎస్‌కేపీ  ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలన్న కుట్రను ఛేదించిన ఏటీఎస్ పోలీసులు ఆ కుట్రలో కీలకంగా ఉన్న  ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై   జైలులో ఖైదీలు కొందరు   దాడి చేశారు.

 అతడిని హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ.. అకస్మాత్తుగా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారని అధికారులు తెలిపారు.  దీని గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది.  దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు చేపట్టింది.  

ఈ నెల 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ( ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్  కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌ అనే వ్యక్తితో టచ్‌లో  ఉండి,  అతడి ఆదేశాల మేరకు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu