Latest News

తెలంగాణ లోక్‌భవన్‌లో ఎట్‌హోం

posted on: Jan 26, 2026 6:29PM

 

రిపబ్లిక్‌ డే సందర్భంగా తెలంగాణ లోక్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్ హోం వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను గవర్నర్ ప్రదానం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పద్మ పురస్కార గ్రహీతలు, కళాకారులు, క్రీడాకారులతో ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా లోక్ భవన్‌ను విద్యుత్ దీపాల అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.  ఈ తేనీటి విందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ పాల్గోన్నారు 

google-ad-img
    Related Sigment News
    • Loading...