Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ లిక్కర్ స్కామ్...రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్
posted on: Mar 6, 2026 7:18PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని ఈడీ పేర్కొంది.మద్యం కుంభకోణం ద్వారా ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు.
ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్ బ్యాక్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసిరని ఈడీ తెలిపింది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డికి సిట్ విచారణ పూర్తయింది. రెండ్రోజుల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. వైద్య పరీక్షల తర్వాత వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసువదేవరెడ్డి బెవరేజెస్ ఎండీగా పని చేశారు.



.webp)


