4 రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

posted on: Mar 15, 2026 5:39PM

 

దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది . అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వెల్లడించింది. 

ఎన్నికల ప్రకటనతో పాటు వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఈ నెల 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 6 నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు. ఏప్రిల్ 7 నామిషేన్ల పరిశీలన ఉంటుంది.  నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 9. ఇక ఏప్రిల్ 23న పోలింగ్,మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ 6 నాటికి తమిళనాట ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఈసీ వెల్లడించింది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...