Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేను అస్సాం టీనే అమ్మేవాడిని- మోదీ
posted on: Mar 26, 2016 2:07PM

త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలోని ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. పదిహేను సంవత్సరాలుగా అస్సాంను ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, ఈసారైనా విజయతీరాలను చేరుకోవాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ప్రధానమంత్రి మోదీ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాను టీలు అమ్ముకునేటప్పుడు, అస్సాంటీని ఉపయోగించేందుకు ప్రాధాన్యతని ఇచ్చేవాడినని చెబుతున్నారు మోదీ. అస్సాం టీ జనానికి ఉత్సహం కలిగిస్తుంది కానీ, తేయాకుని విస్తృతంగా పండిస్తున్న అస్సాం ప్రజలు జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడలేదని చెప్పుకొచ్చారు.
అస్సాం ప్రజల్లో దాదాపు 20 శాతం ఉన్న తేయాకు కార్మికులు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు వారిని ఆకర్షించనున్నాయి. అస్సాంలో సహజ వనరులు ఉన్నప్పటికీ అక్కడ తాగేందుకు మంచినీటి వసతిని కూడా కల్పించలేదని, గ్యాస్ నిక్షేపాలు ఉన్నప్పటికీ వంట చేసుకునేందుకు గ్యాస్ సదుపాయం లేదని విమర్శించారు మోదీ. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అత్యంత ధనిక రాజ్యంగా ఉన్న అస్సాం ఇప్పుడు పేదరికంలో మునిగిపోయిందని వాపోయారు. ఇప్పటికీ అస్సాంలోని రెండువేల గ్రామాలకి విద్యుత్ సౌకర్యం కూడా లేదని వెల్లడించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్ పెద్దవారైపోయా





