మొన్న వర్మ ఈ సారి వర్మ... శర్మ ఇద్దరూ వండర్స్
posted on Nov 3, 2025 10:01AM

మొన్న ఆసియా కప్ తిలక్.. వర్మ రూపంలో భారత్ పరం కాగా..నేడు విమెన్స్ వరల్డ్ కప్ వర్మ, శర్మ ఇద్దరూ కలిసి భారత్ కి ప్రపంచ కప్పు సాధించి పెట్టారు. ఎప్పటిలాగానే సౌతాఫ్రికా ఫైనల్స్ ఫీవర్ తో కప్పు చేజార్చుకోవడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
ఇంతకీ ఎవరా శర్మ- వర్మ అంటే దీప్తీ శర్మ- ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ కాగా,. అదే షఫాలీ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి.. ఈ కాంబోకి తిరుగులేదని నిరూపించారు. ఇంతకీ దీప్తీ శర్మ ఈ సీరీస్ మొత్తంలో సాధించిన వికెట్లు ఎన్ని? షఫాలీ ఈ మ్యాచ్ లో చూపించిన మ్యాజిక్ ఎలాంటిదో చూస్తే.. షఫాలీ వర్మ ఈ మ్యాచ్ లో 87 పరుగులు సాధించి.. తద్వారా గౌరవప్రదమైన స్కోరు ప్రత్యర్ధి ముందుంచడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక దీప్తీ శర్మ ఈ టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు 22 వికెట్లతో ఆల్ రౌండ్ షో చేసి చూపించింది, అర్ధ సెంచరీ సాధించడం మాత్రమే కాక ఫైనల్‌లో కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్‌కు కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
ఒక టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సైతం బద్దలు కొట్టిందీ దీప్తి శర్మ. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన విమెన్ క్రికెటర్స్ లో టాప్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే ఇదొక కలలాగా అనిపిస్తోంది. ప్రపంచ కప్ ఫైనల్ లో తాను జట్టుకు ఇంత ఉపయోగపడతానని అస్సలు ఊహించలేదని అంటారు దీప్తి. ఎనీ హౌ కంగ్రాట్స్ దీప్తీ అండ్ షఫాలీ అండ్ ఆల్ విమెన్ క్రికెటర్స్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా వీరిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.