Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అనుమానాస్పద స్థితిలో ఏఎస్ఐ మృతి
posted on: Mar 18, 2026 3:25PM

విజయవాడ సమీపంలోని యనమలకుదురులోసస్పెన్షన్ కు గురైన ఓ ఏఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మరణించారు. విధుల నుంచి సస్పెండైన కొద్ది రోజులకే ఆ ఏఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. పడమట పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వీరవల్లి గోపి వెంకట దుర్గాప్రసాద్ దాదాపు పక్షం రోజుల కిందట సస్పెన్షన్ కు గురయ్యారు.
ఒక కేసు దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న వెంకట దుర్గాప్రసాద్.. బుధవారం (మార్చి 18) యనమలకుదురు కరకట్ట శివారులో ని ఓ పాకలో విగతజీవిగా కనిపించారు. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వెంకట దుర్గాప్రసాద్ ది ఆత్మహత్యా, మరే కారణమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సస్పెన్షన్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఉండగా విధుల నుంచి సస్పెండైన తరువాత నుంచి ఆయన ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదనీ, తీవ్ర మనోవేదనతో ఉన్నారనీ కుటుంబ సభ్యులు తెలిపారు.


.webp)



