Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేజ్రీవాల్ కారు మీద దాడి!
posted on: Feb 29, 2016 1:53PM

పంజాబ్‌లో పర్యటిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కారు మీద కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. లుధియానాలో జరుగుతున్న ఒక సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగానే, సమావేశ భవంతి వెలుపల భారీగా ఆందోళనకారులు పోగయ్యారు. ప్రమాదాన్ని గ్రహించిన స్థానిక పోలీసులు, ఆయనను వెనుక దారి నుంచి పంపేందుకు ప్రయత్నించిలా లాభం లేకపోయింది. ఈ దాడికి పాల్పడినవారు అకాలీదళ్‌కు చెందిన నేతలుగా భావిస్తున్నారు. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా బలపరిచేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. 2017లో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి, ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ స్థిరపరచాలని కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసమే ప్రస్తుతం పంజాబులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేజ్రీవాల్ పర్యటన వల్ల అసహనానికి గురైన స్థానిక నేతలే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.


.jpg)
.jpg)


