అరుణాచల్‌లోని 27 కీలక ప్రాంతాలకు అధికారిక ముద్ర!.. చైనాకు బిగ్ షాకిచ్చిన ఇండియా.!

posted on: Aug 8, 2026 3:24PM

అరుణాచల్ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాలలో చైనా రీనేమింగ్ లేదా పేర్ల మార్పుల ద్వారా చేస్తున్న కవ్వింపు చర్యలకు ఇండియా స్ట్రాంగ్ రిటార్డ్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 27   కీలకమైన వ్యూహాత్మక, భౌగోళిక ప్రాంతాలను వాటి అసలైన  ఇండయన్ స్టాండర్డ్ పేర్లతో  సర్వే ఆఫ్ ఇండియా  అధికారిక మ్యాప్‌లలో చేర్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ నిర్ణయం ద్వారా భారత భూభాగంపై తమకే పూర్తి సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయనే స్పష్టమైన సందేశాన్నిఇండియా ప్రపంచానికి చాటింది. మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఈ 27 ప్రాంతాలలో 21 నివాస ప్రాంతాలు, గ్రామాలు ఉండగా, నాలుగు ఎత్తైన పర్వత కనుమలు, ఒక సరస్సు,  హిస్టారిక్  సైనిక స్మారకం ఉన్నాయి. ప్రజల్లో ఈ ప్రాంతాల భౌగోళిక, చారిత్రక ప్రాధాన్యతపై సరైన అవగాహన పెంచడమే కాకుండా, భూముల రికార్డులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మ్యాపింగ్ దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ మ్యాప్‌లలో స్థానం పొందిన ప్రదేశాలలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలోని లాంగ్ జు, మజా, బిసా గ్రామాలు  ప్రాముఖ్యత కలిగినవి.  1959లో భారత్, చైనాల మధ్య  రిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా లాంగ్ జు నిలిచింది. అలాగే, 1962 నాటి భారత్, చైనా యుద్ధంలో తీవ్రమైన పోరాటాలు జరిగిన ఠాగ్ లా కనుమతో పాటు జో లా, రిజా లా, పుకుర్ లా వంటి కీలక వ్యూహాత్మక పర్వత మార్గాలను కూడా సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా నమోదు చేసింది.

వీటితో పాటు చాంగ్ లాంగ్ జిల్లాలోని జైరామ్‌పూర్ ప్రాంతం తూర్పు అరుణాచల్ ప్రదేశ్ మరియు మైన్మార్ సరిహద్దులకు భద్రతా దళాల రవాణాకు కీలక లాజిస్టిక్స్ కేంద్రంగా పనిచేస్తోంది. సరిహద్దు రక్షణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను గౌరవిస్తూ  జస్వంత్ గఢ్,   షేర్-ఏ-థాపా' స్మారక చిహ్నాలను కూడా జాతీయ రికార్డులలో చేర్చింది. ధన్ బారి, ప్రీత్‌నగర్, జ్యోతినగర్, సంభో సరోవర్, కామ్‌లాంగ్ నగర్, బుద్ధమందిర్ వంటి పలు ప్రదేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను  జాంగ్నాన్  లేదా దక్షిణ టిబెట్ అని పిలుస్తూ, అక్కడి ప్రాంతాలకు వరుసగా చైనీస్ పేర్లను ప్రకటిస్తూ  మ్యాప్ వార్ నడుపుతోంది. 2017, 2021, 2023,  2024లలో చైనా ప్రభుత్వం అరుణాచల్‌లోని అనేక ప్రదేశాలకు కల్పిత పేర్లను కేటాయిస్తూ జాబితాలను విడుదల చేసింది. అయితే, చైనా చేసే ఈ కల్పిత పేర్ల ప్రచారాలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ  వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని స్పష్టం చేస్తోంది.

ఇటీవల సరిహద్దుల్లో చైనా దళాలు చొరబడ్డాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు భారత సైన్యం కూడా ఖండించాయి.  ఇప్పుడు భారత్ స్వయంగా 27 ప్రాంతాల అసలైన పేర్లను అధికారిక మ్యాప్‌లో నమోదు చేయడం ద్వారా చైనా నకిలీ కథనాలకు   చెక్ పెట్టింది.

కేవలం రాజకీయ నిరసనలకు పరిమితం కాకుండా, వ్యూహాత్మక ప్రాంతాల పేర్లను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో పొందుపరచడం ద్వారా  అతర్జాతీయంగా భారత్ తన భూభాగాలపై పూర్తి చట్టబద్ధమైన హక్కులను పత్రాల రూపంలో బలోపేతం చేసుకున్నట్లయింది.

చైనా కవ్వింపు చర్యలకు ప్రతిగా భారత్ చేపట్టిన ఈ చారిత్రక మ్యాపింగ్ చర్య సరిహద్దు భద్రత విషయంలో దేశం అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రతిబిండంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Arunachal Pradesh,  border dispute, India China border, Survey of India map,  Ministry of Home Affairs,  Line of Actual Control LAC 

google-ad-img
    Related Sigment News
    • Loading...