Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గోడ కూలి పదో తరగతి విద్యార్థి దుర్మరణం.. స్పందించిన లోకేష్..!
posted on: Aug 17, 2026 7:38PM
.webp)
స్కూల్ ప్రహరీ కూలి బాలుడు మృతి..బాధ్యులపై చర్యలకు విద్యాశాఖ ఆదేశం..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బౌండరీ వాల్ ఒక్కసారిగా కూలిపోవడంతో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పాఠశాల మధ్యాహ్న భోజన సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. విద్యార్థులు తుపాకుల అరుణ్ తేజ (15), సొండి యాకూబ్ ఇద్దరూ పాఠశాల ఆవరణలోని ప్రహరీ గోడ వద్దకు వెళ్లి కూర్చున్న సమయంలో, పురాతనమైన ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరుణ్ తేజ అక్కడికక్కడే ప్రాణాలు వదిలగా, తీవ్ర గాయాలపాలైన యాకూబ్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
చిన్నవయసులోనే ఎదిగిన కొడుకు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లిపోవడంతో అరుణ్ తేజ తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికీ గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందంటూ పాఠశాల ప్రాంగణంలోనే మృతదేహంతో నిరసనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘోర ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న బాలుడు ఇలా అకాల మరణం చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థి యాకూబ్‌కు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాల గోడ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి, నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఏపీవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలు, ప్రహరీ గోడల భద్రతను సమీక్షించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Arun Teja, Nara Lokesh, Salur school wall collapse, Parvathipuram Manyam district, Andhra Pradesh school accident, Government High School Salur, Nara Lokesh Response, Parvathipuram Manyam News


.webp)
.webp)


