బ్యాంకుల జోలికి రావద్దు... అరుణ్‌జైట్లీకి హెచ్చరిక!

posted on: Mar 8, 2016 10:31AM

 

లక్షలకోట్లకొద్దీ నష్టాలతో కుంగిపోతున్న బ్యాంకులను ఆదుకునేందుకు, ఆర్‌.బీ.ఐ మొదలుకొని ఆర్థికమంత్రిదాకా ఏవేవో పథకాలు ప్రకటిస్తున్నారు. కానీ ఈ విషయంలో ప్రజలు, ప్రతిపక్షాల నిరసనలను దృష్టిలో ఉంచుకోవలసి వచ్చేట్లుంది. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాను 80 శాతం నుంచి 50 శాతం కంటే తక్కువకు తగ్గించుకోనుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేట్‌ పరం చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అంటూ సీతారాం ఏచూరి హెచ్చరించారు.

ఐడీబీఐ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకదానితో ఒకటి విలీనం చేయాలన్న ప్రతిపాదనలను కూడా ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో కూరుకుపోవడానికి కారణం... ఉన్నతస్థాయి అధికారుల వైఫల్యం, రాజకీయ జోక్యమనీ, బ్యాంకుల విలీనం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. మరి బ్యాంకులను తిరిగి లాభాలబాట పట్టించేందుకు ఆర్థికమంత్రి ఏం చేస్తారో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఏం చేస్తుందో!

google-ad-img
    Related Sigment News
    • Loading...