Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రావిడెంట్ ఫండ్ గురించి నిమిషానికో మాట!
posted on: Mar 2, 2016 10:05AM

‘రిటైర్మెంట్ సమయంలో భవిష్య నిధి ద్వారా లభించే డబ్బులో 40 శాతం మీద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది,’ అంటూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనగానే మధ్యతరగతి ప్రజలంతా సంతోషించారు. కానీ భవిష్య నిధిలోని 60 శాతం మీద ఆదాయపు పన్నుని విధిస్తామన్న విషయాన్ని ఆర్థికమంత్రి ఇలా తెలివిగా చెప్పారన్న నిజం తట్టగానే, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై దేశమంతా ఒక్కసారిగా గగ్గోలెత్తిపోవడంతో ‘కాదు కాదు... 60 శాతం భవిష్య నిధి మీద వచ్చే వడ్డీ మీదే పన్నుని విధించనున్నాము’ అంటూ అధికారులు వివరణను ఇచ్చారు. మరోవైపు... మరేదన్నా పొదుపు పథకం కోసం ఈ డబ్బుని వినియోగించకపోతేనే, ఆదాయపు పన్నుని విధిస్తాం అని మరో వివరణ వినిపించింది.
అది కూడా ఏప్రిల్ 1, 2016 తరువాత భవిష్య నిధిలో జమ అయ్యే డబ్బు మీద వడ్డీ మీద మాత్రమే ఆదాయపు పన్ను ఉంటుందని మరో మాట అన్నారు. అసలు ఆదాయపు పన్ను అంటేనే అదో పద్మవ్యూహం. దానికి తోడు ఆర్థికశాఖకే ఈ విషయం మీద స్పష్టత లేకపోతే, సామాన్య జీవుల పరిస్థితి ఏంకాను! ఈ సందేహాలన్నింటినీ తీర్చేందుకు ఇప్పడు ప్రభుత్వమే ఆర్థిక బిల్లుకి ఓ సవరణ చేపట్టనున్నట్లు ఓ సమాచారం! సామాన్య ప్రజలు ఇప్పటికే ఆదాయపు పన్ను అంటే భయపడిపోతున్నారు. ఆ విషయం ప్రభుత్వాలన్నీ ఒప్పుకుంటూనే వస్తున్నాయి. అందుకనే ఆదాయపు పన్నుని నివేదించడం ఇక మీదట మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థికమంత్రి తన ప్రసంగం మొదట్లోనే చెప్పారు. కానీ జరిగింది చూస్తే....


.jpg)



