కడప దర్గాలో ఏఆర్ రెహ్మాన్

 

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్  కడపలోని అమీన్‌పీర్ దర్గాలో   సందడి చేశారు.  దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా  తొలి రోజు గురువారం (నవంబర్ 6) ప్రధాన ముజావర్ అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి  గంధం ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  మతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు వెళ్లి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు హాజరవుతుంటారు.  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దర్గా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టంగా ఏర్పాటు చేశారు. పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ఇంటి నుండి బుధవారం (నవంబర్ 5)రాత్రి మేళ తాళాల నడుమ గంథాన్ని పీఠాధిపతి ఊరేగింపుగా తీసుకుని వచ్చి దర్గాలోని మజర్ వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్  ఏటా ఈ  ఉరుసు ఉత్సవాలలో గంధం రోజు తప్పకుండా పాల్గొంటారు .ఈ ఏడాది జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కుడా మొదటి రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్  కడప పెద్ద దర్గా లో పీఠాధిపతి తో అరీఫుల్లా హుస్సేనితో కలిసి ప్రార్ధనలు  చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu