జనసేన ఎమ్మెల్యే రాసలీలలు... మహిళా కమిషన్ సీరియస్

posted on: Jan 28, 2026 5:40PM

 

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై అత్యాచారం ఆరోపణలు కలకలం రేపాయి. జనసేన పార్టీ ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఎమ్మెల్యే వారం రోజుల్లోగా కమిటీ ముందు హాజరు కావాలని అధిష్టానం ఆదేశించింది. ఇటు ఏపీ మహిళా కమిషన్ కూడా ఈ ఆరోపణలపై స్పందించి, సమగ్ర విచారణకు హామీ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే మాత్రం తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు.  ఆ క్రమంలో శ్రీధర్‌పై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ వీడియోలను విడుదల చేసింది.  2024 జూన్ లో  ఎమ్మెల్యే శ్రీధర్ కి ఫేస్ బుక్ ద్వారా మెస్సేజ్ చేసానని,  ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలిపానని పేర్కొంది. 

ఇద్దరం నెంబర్లు మార్చుకుని టెలిగ్రామ్‌లో చాట్ చేసుకునేవారిమని,  రెండు రోజుల తరవాత న్యూడ్ వీడియోలు పంపాలని ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. తరువాత లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆ కారణంగా  ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడంతో అబార్షన్ చేపించుకోమన్నాడని ఆరోపణలు గుప్పించింది. తాను నిరాకరించడంతో ఇంటికి వచ్చి భౌతిక దాడికి పాల్పడ్డాడని, చేసేదేమీ లేక అబార్షన్ చేయించుకున్నానని బాధితురాలు తెలిపింది.

అతడి కారణంగా తన భర్త తనకు దూరమయ్యాడని పేర్కొంది. ఆమె వీడియో వైరల్ అవ్వడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.  వారంలో కమిటీ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌పై ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కూడా స్పందించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని,  బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నామని శైలజ వెల్లడించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను మహిళా కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆమె ట్వీట్ చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...