Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గల్ఫ్ ఉద్రిక్తతలు.. ఆక్వా రైతులకు భయం అవసరం లేదు : అచ్చెన్నాయుడు
posted on: Mar 11, 2026 2:56PM

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మీడియా కథనాలు, వదంతుల కారణంగా కొందరు రైతుల్లో భయం నెలకొన్నప్పటికీ పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దని ఆయన సూచించారు. ముందస్తు హార్వెస్టింగ్ వల్ల మార్కెట్‌లో ఒక్కసారిగా సరఫరా పెరిగి రొయ్యల ధరలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
భారతదేశం నుండి జరిగే సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3–4 శాతం మాత్రమేనని మంత్రి తెలిపారు. యూరప్, అమెరికా, జపాన్, చైనా వంటి ప్రధాన మార్కెట్లకు సముద్ర మార్గాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుత గల్ఫ్ పరిస్థితులు భారత సముద్ర ఆహార ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవన్నారు.
అమెరికా మార్కెట్‌లో కూడా త్వరలో డిమాండ్ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇతర దేశాలకు యూరోపియన్ యూనియన్, అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార కంటైనర్లు రెడ్ సీ సూయెజ్ కాలువ మార్గం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం, చైనా సముద్ర మార్గం ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. భారతీయ రొయ్యలపై ఉన్న టారిఫ్‌లు ఇతర పోటీ దేశాలతో సమానంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశ పోటీ సామర్థ్యం కొనసాగుతుందని వివరించారు.
ఇక షిప్పింగ్ కంటైనర్ల కొరత ఉందన్న ప్రచారం కూడా అసత్యమని మంత్రి ఖండించారు. ఎగుమతులు సాధారణంగానే కొనసాగుతున్నాయని, పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. రైతులు వదంతులను నమ్మకుండా శాస్త్రీయ విధానంలో అక్వాకల్చర్ కొనసాగించాలని, కల్చర్ సైకిల్ పూర్తయ్యాకే హార్వెస్టింగ్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.



.webp)


