Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Brahmamudi : చనిపోయిన కావ్య.. తనకి మాటిచ్చిన అపర్ణ !
posted on: Feb 27, 2026 11:16AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి ( Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 966 లో.. ఒక చోట ధాన్యలక్ష్మి, ప్రకాష్, కావ్య అంతా కదలకుండా పడిఉండగా రాజ్ లేచి రాహుల్ ని చంపేస్తాడు. ఇక కావ్య వైపు రాజ్ ఎమోషనల్ గా చూస్తుండగా అప్పుడే రుద్రాణి వెనుక నుండి వచ్చి రాజ్ తలమీద కొడుతుంది. దాంతో కావ్య దగ్గరగా పడతాడు రాజ్. నా వారసుడిని నువ్వు చంపావ్ కదా.. ఇప్పుడు నీ వారసుడిని నేను చంపుతానంటూ గన్ తీసుకొని అపర్ణ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. మన బిడ్డల్ని కాపాడు కళావతి అంటు కావ్యని లేపి రాజ్ చనిపోతాడు. ఇక రుద్రాణి గన్ తో కాల్చబోతుంటే ఒక కర్రని విసిరేస్తుంది కావ్య. ఇక తనని చూసి రుద్రాణి షాక్ అవుతుంది.
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి దానికి ఈ భూమి మీద బ్రతికే అవసరం లేదని, అడుక్కుతినే నీ కొడుకుని మహారాజులా చూసుకుంది ఈ కుటుంబం.. కానీ నువ్వేం చేశావ్ అంటు రుద్రాణని కావ్య తిడుతుంది. మారవే నువ్వు ఇంకా.. ఇలాంటి నీతి మాటలు చెప్పే ఈ ఇంటికి మాహారాణివై కూర్చున్నావ్.. నా కొడుకుని ఆ ఇంటికి రాజుని చేద్దామనుకుంటే అడ్డుగా నిలబడ్డావని రుద్రాణి అంటుంది. అదిగో పడుకున్నాడుగా తీసుకెళ్ళి పాడెకట్టి మహారాజుని చేయవే అని కావ్య అంటుంది. ఇక కోపం పట్టలేక కావ్యని తోసేస్తుంది రుద్రాణి. దాంతో తను అమ్మవారి దగ్గర పడుతుంది. అక్కడున్న త్రిశూలాన్ని కావ్య తీసుకొని వెళ్ళి రుద్రాణిని పొడుస్తుంది. దాంతో రుద్రాణి చనిపోతుంది. ఇదంతా కార్ లో ఉన్న రేఖ చూస్తుంటుంది. ఆ తర్వాత అపర్ణని చివరి మాట అడుగుతుంది కావ్య. తన కూతురికి దుగ్గిరాల పేరుని ఇవ్వండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తనతోనే ఉండండి అత్తయ్య.. తన భవిష్యత్తుని మీరే సరిదిద్దాలని కావ్య అడుగగా అపర్ణ మాటిస్తుంది దాంతో కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది.
మరోవైపు స్వరాజ్ ఒక దగ్గర పడిఉంటాడు. అతను లేచి నడుస్తూ నడుస్తూ ఒక కార్ కి అడ్డుగా పడిపోతాడు. ఆ కార్ లో లక్ష్మీ తన భర్త కలిసి వస్తుంటారు. స్వరాజ్ అలా పడిపోవడం చూసి కార్ డ్రైవర్ ఆపుతాడు. ఇద్దరు వెళ్ళి చూస్తారు. కార్ డ్రైవర్ వస్తాడు. మనకెందుకు మనం వెళ్దాం.. నా కార్ మీద కేస్ అవుతుందని కార్ డ్రైవర్ అనగానే మానవత్వం లేదా.. మేము ఆ బాబుని చూసుకుంటామని లక్ష్మీ చెప్పి హాస్పిటల్ కి వెళ్ళమంటుంది. మరోవైపు పిల్లలని, సుభాష్ ని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ బయట కూర్చొని అపర్ణ ఏడుస్తుంది. ఒక డాక్టర్ వచ్చి పిల్లలకు ఏం కాలేదు.. బాగానే ఉన్నారని చెప్తాడు. మరో డాక్టర్ వచ్చి.. ఐ ఆమ్ సారీ మేడమ్.. ఆయన స్పైన్(వెన్నెముక)కి గాయం అయింది. అతను నడవలేడని చెప్తాడు. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






