Latest News

రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఏపీ సర్కార్ పచ్చజెండా

posted on: Mar 27, 2026 1:33PM

ఆంధ్రప్రదేశ్   మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.  ఏపీ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజ్ కేసిరడ్డి  తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.   షాబాద్‌లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం రూ. 2.69 కోట్లుగా చూపించారు. అలాగే జనగామలో తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరుతో లక్షల రూపాయల  విలువైన ప్లాట్లు కొన్నట్లు సిట్ గుర్తించింది. 

ఈ ఆస్తుల జప్తునకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఇదే కేసులో   రాజ్ కేసిరెడ్డికి సంబంధించి వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ, సిట్ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా గుర్తించిన రూ. 70 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలుకు సిట్ ప్రభుత్వ అనుమతి కోరగా, ప్రభుత్వం అందుకు అనుమతించింది. దీంతో నేడో రేపే సిట్ ఏసీబీ కోర్టులో ఈ ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...