ఏపీ లిక్కర్ స్కామ్ వాసుదేవ రెడ్డి బెయిల్ పిటిషన్‌ వాయిదా

posted on: Jun 17, 2026 7:04PM

 

ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్ చేసిన వాసుదేవ రెడ్డి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించారు. తన అమ్మమ్మ (గ్రాండ్‌మదర్) మరణించారని, కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు మరియు తదుపరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 7 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఈడీ కోర్టు, వాసుదేవ రెడ్డి అభ్యర్థనపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ అధికారులను ఆదేశించింది. అలాగే, మధ్యంతర బెయిల్ మంజూరుకు అనుకూల, ప్రతికూల అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించింది. కాగా, ఏపీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఇటీవల వాసుదేవ రెడ్డితో పాటు రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఇద్దరూ న్యాయస్థాన ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాసుదేవ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈడీ కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ఇరు పక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో వాసుదేవ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభిస్తుందా లేదా అన్నది రేపటి విచారణలో తేలనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...