ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా...18 బిల్లులకు ఆమోదం

posted on: Mar 6, 2026 3:13PM

 

ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభ ఐదో సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 15 రోజులపాటు 72 గంటల 14 నిమిషాలపాటు సమావేశాలు జరిగాయి. 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మొత్తం 80 ప్రశ్నలకు సభాసమక్షంలో ఉంచారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో 18 బిల్లులు ఏకగ్రీవంగా సభ్యులు ఆమోదించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభను సమర్ధవంతంగా నిర్వహించారు. 

సుమారు 6,693 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. ఇక సభ వాయిదా అనంతరం సభాపతి మాట్లాడుతు శాసన సభ సమావేశాలు జరిగేందుకు సహకరించిన సభ్యుల అందరికీ ధన్యవాదలు తెలిపారు. ఈ సాయంత్రం ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని, ప్రతిఒక్కరూ కుటుంబసమేతంగా రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...