Latest News
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో చుక్కెదురు
posted on: Mar 14, 2026 9:13AM

రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ2 గా ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎష్సార్ ఆంజనేయులుకి హైకోర్టులో చుక్కెదురైంది. కే పీఎస్సార్ ఆంజనేయులు విచారణకు హాజరుకావాల్సిందేనని ఏపీ హైకోర్టు విస్పష్టంగా పేర్కొంది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరై సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో పీఎస్సార్ ఆంజనేయులు దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌తో కలిపి ఆంజనేయులును విచారించాల్సి వుండచ్చని వ్యాఖ్యా నించింది.
కాగా విచారణ సమయంలో పీఎస్సార్ ఆంజనేయులుపై ఎటువంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని పోలీసులకు కోర్టు సూచించింది. 2025 జులై నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ పిటిషన్‌ను న్యాయస్థానం ముగించింది. అరెస్ట్ భయం ఉంటే కొత్తగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పీఎస్సార్ ఆంజనే యులుకు సూచించింది. గత వైసీపీ హయాంలో అప్పటి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నం చేశారంటూ 2024 జులై 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల పాత్రపై దర్యాప్తు సాగుతున్న సంగతి తెలిసిందే.



.webp)


