Latest News

కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి వంగలపూడి అనిత

posted on: Jan 22, 2026 2:45PM

విధి నిర్వహణలో లేకపోయినా, అంకిత భావంతో చంటిబిడ్డను చంకనెత్తుకుని మరీ రద్దీ రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన అందరి చేతా సెభాష్ అనిపించుకున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం (జనవరి 22) తన నివాసంలో సత్కరించారు. సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని బుధవారం స్వయంగా ఫోన్ చేసి అభినందించిన హోంమంత్రి అనిత.. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. తను ఆ రోజు డ్యూటీ లో లేకపోయినా, తరువాత కూడా ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజల ఇబ్బందులను గమనించిన జయశాంతి చేతిలో చంటిబిడ్డతోనే ట్రాఫిక్ ను నియంత్రించి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన అంబులెన్స్ కు దారి సుగమం చేశారు.  

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సామాజిక బాధ్యతతో    జయశాంతి చేసిన డ్యూటీ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విషయం హోంమంత్రి అనిత దృష్ఠికి రావడంతో ఆమె స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందించారు. ఆ సందర్భంగా జయశాంతిని కుటుంబ సమేతంగా  తన నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ మేరకు జయశాంతి తన భర్త, ఇద్దరు పిల్లలతో విజయవాడలోని వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయానికి వచ్చారు.  ఈ సందర్భంగా  జయశాంతికి అనిత బొట్టు పెట్టి, చీర, గాజులు బహూకరించారు.  విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉంటుందని అనిత చెప్పారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...