ఏపీ హోంమంత్రి పదవి వారిలో ఎవరికో.. ?

posted on: Jul 12, 2016 11:46AM

 

ఎప్పుడు ఎవరు గెలుస్తోరో... ఎలా ఓడిపోతారో..ఎవరికి పదవులు దక్కుతాయో.. ఎవరికి దక్కవో.. రాజకీయాల్లో ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఎప్పుడూ చెప్పలేము. రాజకీయాల్లో ఎప్పుడైనా ఎదైనా జరగవచ్చు.. కాకపోతే కాస్త అదృష్టం ఉండాలంతే.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ టీడీపీలో కూడా అదే జరుగుతుంది. అదేంటంటే.. ఏపీ హోంమంత్రి పదవి.. ఎవరికి దక్కుతుందా..అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ప్రస్తుతం ఏపీ హోంమంత్రిగా చినరాజప్ప ఉన్న సంగతి తెలిసిందే. అయితే చినరాజప్పపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చినరాజప్ప  కాల్ మనీ కేసు, శాంతిభద్రతలు కాపాడలేకపోవడం, అధికారుల పై పట్టు లేకపోవడం ఇలా కొన్ని కారణాల వలన చంద్రబాబు అతని పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈసారి హోంమంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అన్నదానిపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో నేత పేరు వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతకు హోంమంత్రి పదవి దక్కనున్నట్టు విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది కాస్త ఆ నోటా ఈ నోటా పాకి ఆ నేత చెవిలో పడిందట. ఇంకేముంది ఆయన సంతోషం పట్టలేక.. ఆ విషయం కాస్త చంద్రబాబును అడిగేశాడట. చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే ఓ నవ్వు నవ్వి సైలెంట్ గా ఉన్నారంట. అంతేకాదు ఇదే పదవికి పార్టీలోకి కొత్తగా వచ్చిన మరో ఎమ్మెల్యేకు కూడా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది.

 

మరోవైపు ఈ పదవి సంగతేమో కాని పార్టీలో వర్గపోరు మాత్రం బయపడేలా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే చినరాజప్ప కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి.. అసలే ముద్రగడ చేసిన రచ్చ వలన చంద్రబాబుకు ఇంకా తలనొప్పులు ఉన్న నేపథ్యంలో ఆయనను తప్పించి వేరే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇస్తే.. చీలక వస్తుందని భయపడుతున్నారంట. మరి చుద్దాం ఎవరికి ఆపదవి దక్కుతుందో.

google-ad-img
    Related Sigment News
    • Loading...