జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. సంగం స్వాధీనం చెల్లదన్న హైకోర్టు 

posted on: May 7, 2021 12:03PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సంగం డెయిరీని స్వాధీనంపై సర్కార్ ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సంగం డెయిరీని ఏపీ డెయిరీలో విలీనం చేస్తూ సర్కార్ ఇచ్చిన జీవో చెల్లదని  హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోజువారి డెయిరీ కార్యకలాపాలను ప్రస్తుత డైరెక్టర్లు పర్యవేక్షించాలని సూచించింది ధర్మాసనం. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది . 

సంగం డైరీ లో ఏసీబీ సోదాలు పేరిట డేటా చౌర్యం జరగబోతోందని పాలకవర్గం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏసీబీ సోదాలు పేరిట ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు మినహా మిగతా అమ్మకాలు మార్కెటింగ్ తదితర విషయాలలో ఏసీబీ పోలీసులు జోక్యం చేసుకోరాదని డేటాను యాక్సెస్ చేయడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

సంఘం డైరీని తెనాలి సబ్ కలెక్టర్కు స్వాధీన పరుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 19 ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది తాత్కాలిక కార్యకలాపాల్లో ఐఏఎస్ ఆఫీసర్ జోక్యం చేసుకోవడం సంస్థ కార్యకలాపాలకు  ఆటంకం కలుగుతుందని పేర్కొంటూ డైరెక్టర్ల బోర్డు సంగం డైరీ కార్యకలాపాలను యధాతధంగా నిర్వహించుకోవచ్చని హై కోర్టు తీర్పు ఇచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...