ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై స్టేకు ఏపీ హైకోర్టు నో

posted on: Apr 16, 2026 12:35PM

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు   నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై   స్టే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. పిటిషన్ పిల్ వెనుక ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేసింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన ఆంజనేయ ప్రసాద్ అనే రైతు దాఖలు చేసిన పిల్ పై నిన్న విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేమని స్పష్టం చేసింది.

 ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ ఉద్దేశాలపై అనుమానం వ్యక్తం చేసింది.  ఓఆర్‌ఆర్‌ ఎక్కడ నిర్మించాలో ఒక రైతు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తూ.. ఇటీవల కాలంలో చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలను  రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన ఈ పిటిషన్ కూడా అలాంటిదేనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది.  మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో న్యాయ స్థానాలు జోక్యం చేసుకోబోవని తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం స్టే నిరాకరిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...