నోరు అదుపులో ఉండాలి కదా?.. అంబటి భార్య పిటిషన్ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు

posted on: Feb 2, 2026 8:24AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషణను తప్పుపట్టింది. రాజకీయ నాయకులుు, ప్రజా జీవితంలో ఉండే నాయకులకు నోరు అదుపులో ఉండాలని వ్యాఖ్యానించింది. ఇతరులను కించపరచడం, వివాదాలకు దారి తీసేలా వ్యాఖ్యలు చేయడం సరి కాదని కుండబద్దలు కొట్టింది.  తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ అంబటి రాంబాబు భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటి వద్ద రక్షణ కల్పించాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అంబటి భాష సరికాదని పేర్కొంది.  

ఇష్టారీతిగా మాట్లాడతాం, రక్షణ కల్పించండి అంటే ఎలా అని పేర్కొంది. నేరాలను అదుపు చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షిం చడమే పోలీసుల పని కాదన్న కోర్టు, సమాజంలో  శాంతిని, సామరస్యాన్ని పెంపొందించాల్సిన  బాధ్యత కూడా పోలీసు వ్యవస్థపై ఉందని పేర్కొంది. ఇలా ఉండగా అంబటి రాంబాబు కుటుంబానికి ఇప్పటికే తగిన భద్రత కల్పించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులు తెలియజేయడంతో, ఆ ఆధారాలను పరిశీలించిన కోర్టు అంబటి భార్య పిటిషన్ ను పరిష్కరించినట్లు పేర్కొంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...