Latest News

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

posted on: Mar 21, 2026 2:36PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పదవీ విరమణ (రిటైర్మెంట్) వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి  పయ్యావుల కేశవ్, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ , మున్సిపల్ శాఖ మంత్రి పీ. నారాయణ పాల్గొన్నారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించకపోయినా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఇక ఈ నిర్ణయంపై ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు A. విద్యాసాగర్  హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...