Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ.!
posted on: Aug 6, 2026 10:55AM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. ఇప్పుడు అంటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఆరు రెట్టు అధికంగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. ఈ విషయాన్ని కేంద్రం లోక్ సభ వేదికగా ప్రకటించింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి లభిస్తున్న మద్దతు, ఆ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల కారణంగానే విదేశీ ఇన్వెస్టర్లు ఏఫీపై ఆసక్తి చూపుతున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి 233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరిగి 608.59 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పెట్టుబడుల పరిమాణం ఆరు రెట్లకు పైగా పెరగడం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రీతిలో తరలివస్తున్నాయో స్పష్టంగా చూపుతున్నాయి.
వైసీపీ హయాంలో పారిశ్రామిక విధానాల్లోని అనిశ్చితి, అస్థిరత వల్ల రాష్ట్రం వైపు ఇన్వెస్టర్లు కన్నెత్తి చూడని పరిస్థితి ఉండేది. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత.. పరిస్థితిలో సమూల మార్పు వచ్చిందని కేంద్రం పేర్కొంది.
వివిధ రంగాల వారీగా రాష్ట్రానికి తరలి వచ్చిన విదేశీ పెట్టుబడుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభ ముందుంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మెటల్) రంగానికి 250.67 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రాన్ని లోహ తయారీ, రవాణా రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ఈ పెట్టుబడులు ఎంతగానో దోహదపడుతున్నాయి.
అదే విధంగా.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 107.30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరగా, సిమెంట్ ఉత్పత్తుల రంగానికి 99.90 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు లభించాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, మౌలిక వసతుల కల్పనకు ఊతమిచ్చే రంగాలలో విదేశీ పెట్టుబడులు భారీగా రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గతంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రతికూల వవాతావరణం నెలకొందని, అయితే ప్రస్తుత తెలుగుదేశం కూటమి పాలనలో పారిశ్రామిక వేత్తలలో , ఇన్వెస్టర్లలో రాష్ట్రంపై గురి కుదిరిందనడానికి ఎఫ్డీఐలలో పెరుగుదలే నిదర్శనం అనడంలో సందేహం లేదు. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలతో రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు మరింతగా తరలివస్తాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడమే కాకుండా సమగ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP Foreign Investment 6X, Andhra Pradesh FDI Growth, Union Finance Ministry, Lok Sabha Data, AP Metal Sector Investment, Food Processing FDI Andhra Pradesh






