ప్రధానిని సత్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

posted on: Jun 10, 2026 7:57PM

దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. కేంద్రంలో ఎన్డీయే ) ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కూటమి భాగస్వామ్య పక్షాల నేతలతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.సమావేశం ప్రారంభానికి ముందే పవన్ కల్యాణ్ ప్రధాని మోడీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ఎన్డీయే కూటమి గత 12 ఏళ్ల ప్రస్థానంపై కీలక చర్చ జరిగింది. ఈ కాలంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, దేశవ్యాప్తంగా అమలు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై కూటమి నేతలు విస్తృతంగా చర్చించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...