Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడగింపు
posted on: May 15, 2026 12:49PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. జూన్ 1 నుండి నవంబరు 30 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ.. డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుండగా, ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.



.webp)


