Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దారుణం.. యజమానిని చంపిన కూలీలు
posted on: Jun 18, 2026 5:34PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కొత్తమురుముళ్ల గ్రామంలో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆక్వా రైతు దాట్ల రామకృష్ణరాజు (68)ను ఆయన చెరువు వద్ద పనిచేసే కూలీలు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా ప్రాంతానికి చెందిన నలుగురు కూలీలు చెరువు వద్దే నివాసం ఉంటూ కాపలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చెరువు పనుల విషయంలో రైతు రామకృష్ణరాజు, కూలీల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో గంజాయి మత్తులో ఉన్న కూలీలు రామకృష్ణరాజుపై దాడి చేసి, బండరాయితో మోది హత్య చేసినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు. అనంతరం అదే రాయిని మృతుడి నడుముకు కట్టి చెరువులో పడేసి ఆధారాలు చెరిపివేయాలని ప్రయత్నించినట్లు విచారణలో తేలింది.
అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఉపాధి కోసం వచ్చే కార్మికుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలని, వారి నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలని యజమానులకు సూచించారు. కూలీల నియామకంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చని హెచ్చరించారు.






