నా మీద పడతారేంటి సామి....

posted on: Nov 29, 2017 11:43AM

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది కదా.. ఇప్పుడు అలాగే ఉంది చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటారా.. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇవాంక వస్తున్నందుకు ప్రభుత్వం మామూలు ఏర్పాట్లు చేయలేదు. హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు... దోమ కూడా వాలకుండా చూస్తున్నారు. ఇక నిన్ననే హైదరాబాద్ మెట్రోను కూడా ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించారు. మెట్రోను ప్రారంభించారు.. కేసీఆర్, కేటీఆర్ పలువురు మంత్రులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.. ఆతరువాత ఇవాంకతో కలిసి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరూ కలుసుకున్నారు.. బాగానే మాట్లాడుకున్నారు.. విందులు ఇచ్చుకున్నారు..

 

ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇవంకా ట్రంప్ సమక్షంలో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోవడం మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. హైదరాబాద్ కు ఇవంకా వచ్చినందుకు, అమరావతి రానందుకు బాబు ఏదో తప్పు చేసినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారు. అమరావతి శంకుస్థాపన అప్పుడు చంద్రబాబు కేసీఆర్ ను పిలిచారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి.. కేసీఆర్ వచ్చారు. కానీ ఇప్పుడు కెసిఆర్ ఆ పద్ధతి పాటించలేదు. కేసీఆర్ ప్రధానిని పిలిచారు కానీ...చంద్రబాబును పిలవలేదు. ఇక గ్లోబల్ సమ్మిట్ కు చంద్రబాబుకు పిలుపురాలేదు. ఆ విషయంలో కూడా చంద్రబాబుకు సంబంధం లేదు. ఏదైనా అనాలంటే కేంద్రప్రభుత్వాన్ని అనాలి. అవన్నీ మానేసి.. చంద్రబాబు రాలేదు.. చంద్రబాబుకు జెలసీ ఎక్కువ అంటూ కొంతమంది మహానుభావులు మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోస్ట్ పెట్టడానికి తయారైపోతుంటారు. పిలవని పేరంటానికి వెళ్లినట్టు.. ఆహ్వానించకపోయినా వెళ్లమంటారో.. ఏమో..? చంద్రబాబును పిలవనందుకు... మోడీ , కెసిఆర్ ని వదిలేసి చంద్రబాబు మీద పడితే ఏమోస్తుంది.  ఏ మాత్రం కామన్ సెన్స్ వున్న వారికి అయినా ఈ విషయం అర్ధం అవుతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...