Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రాహ్మణి భరోసాతో మరో వ్యాపారంలోకి చంద్రబాబు
posted on: Apr 4, 2016 4:04PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లో ఉన్న సీఎం కుటుంబానికి అసలు బ్రాండ్ మాత్రం హేరిటేజ్ ఒక్కటే. చంద్రబాబు అంటే హేరిటేజ్..హేరిటేజ్ అంటే చంద్రబాబు అన్నంతగా ఇది జనాల్లోకి వెళ్లింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హేరిటేజ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే లోకేశ్ సతీమణి, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మాణి వచ్చాకే హేరిటేజ్ భారీ లాభాలు ఆర్జించిందని కార్పోరేట్ టాక్. ఈ నేపధ్యంలో ఆమె మీద నమ్మకంతో హేరిటేజ్ గ్రూప్ మరో రంగంలోకి అడుగు పెట్టింది. ఏ విషయాన్నైనా ముందు చూపుతో ఊహిస్తారని పేరున్న చంద్రబాబు తనకిష్టమైన విద్యుత్ రంగంలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. దానిలో భాగంగా భవిష్యత్‌లో పవన విద్యుత్‌కు ఉన్న అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వజ్రకరూర్ మండలంలోని హోతూర్ గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. ఈ కంపెనీ 2.1 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ఉత్పత్తైన విద్యుత్‌ను ఇతరులకు విక్రయించడంతో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్న తమ డైరీ ప్లాంట్లకు వాడుకోనున్నట్లుగా హేరిటేజ్ గ్రూప్ తెలిపింది. మొత్తం మీద చంద్రబాబు తన కోడలు మీద ఉన్న అపారమైన నమ్మకంతో అడుగు ముందుకు వేశారన్నమాట.






