Latest News
క్వాంటం కంప్యూటింగ్ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం!
posted on: Nov 10, 2025 9:07AM

క్వాంటం కంప్యూటింగ్ విధానానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన సోమవారం (నవంబర్ 10) ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సిఐఐ భాగస్వామ్య సదస్సు, మొంథా తుఫాన్ ప్రభావంతో సంభవించిన పంట నష్టంపై కేబినెట్ చర్చించనుంది.
ఈ రెండే కాకుండా దాదాపు 65కు పైగా అంశాలు ఈ కేబిరెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 7500 కోట్ల రుణం తీసుకునే అంశంపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.



.webp)


