కొత్తగూడెం కార్పొరేషన్‌లో సత్తా చాటుకున్న సీపీఐ

posted on: Feb 13, 2026 6:47PM

 

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐ సత్తా చాటింది. కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు సాధించింది.  కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. సీపీఐ-22  కైవసం చేసుకుంది. కాంగ్రెస్-22, బీఆర్ఎస్-7, సీపీఎం-1, బీజేపీ-1, ఇండిపెండెంట్లు 5 స్థానాలను గెలుచుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు కొనసాగుతున్నారు. కూనంనేని చొరవతోనే కొత్తగూడెం నగరపాలక సంస్థ అయింది. ఆ కార్పొరేషన్‌ను జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌తో పోటీ పడిసత్తా చాటుకోవడం విశేషం అవతరించడం విశేషం. రెండు పార్టీలకు స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...