సాక్షి మీడియాకు ఆర్ఆర్ఆర్ లీగల్ నోటీసులు

posted on: Feb 19, 2026 12:16PM

సాక్షి మీడియాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు  లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడంతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ఉంటున్నాయంటూ నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి రెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లతో సహా సాక్షి మీడియా ప్రతినిధులకు రఘురామకృష్ణంరాజు  గురువారం  (ఫిబ్రవరి 19) ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారు.

 ఈ నోటీసులను న్యాయవాది ఉమేశ్ చంద్ర జారీ చేశారు. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో రఘురామ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...