Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయం!
posted on: Feb 9, 2026 6:11PM
.webp)
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలువుతాయి. ఈ క్రమంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవనున్నారు. ఇప్పటికే వైసీపీ సభ్యులు సభకు హాజరై 6 నెలలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అదే రోజు వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ శాసన సభాపక్ష సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్క రోజు అయినా హాజరు వేసినట్టుగా చూపించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. లేకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే గవర్నర్ ప్రసంగం శాసనసభలో బిజినెస్ డే కాదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ అనర్హత వేటు వేస్తే… “మేము అసెంబ్లీకి హాజరయ్యాం” అని చెప్పుకుని కోర్టులో న్యాయపోరాటం చేసేందుకు ముందే ఈ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. కానీ అసెంబ్లీకి రాకుండానే దొంగ సంతకాలు పెట్టిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఆ కమిటీ సమర్పించే నివేదికే ఇప్పుడు కీలకంగా మారనుంది.






