నీళ్ల కోసం ఆడాళ్లు కొట్టుకున్నట్లు... మందు కోసం మగాళ్లు తోసుకున్నట్లు...

ఏపీ అసెంబ్లీ దగ్గర మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీటైంది. నిన్న మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌ దగ్గర తన్నుకుంటే, ఈసారి మగాళ్ల వంతు వచ్చింది. మీడియా పాయింట్‌ దగ్గరకొచ్చిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు....  వీధి పోరాటానికి దిగారు. నీళ్ల కోసం కుళాయిల దగ్గర ఆడాళ్లు కొట్టుకున్నట్లు, మందు కోసం వైన్స్‌ షాపుల ముందు మగాళ్లు తోసుకున్నట్లుగా మీడియా పాయింట్‌ దగ్గర మైకుల కోసం ఎమ్మెల్యేలు తిట్టుకున్నారు.

 

ఎమ్మెల్యేలంటే కాస్తాకూస్తో ఇంగిత జ్ఞానం ఉంటుందనుకుంటాం, కానీ మినిమమ్‌ కామన్ ‌సెన్స్‌ లేనివాళ్లు చేసినట్లు, బుద్ధిజ్ఞానం లేనివాళ్లు వాగినట్లు... సభ్యత సంస్కారం మరిచి వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నట్లు... ఎమ్మెల్యేల వ్యవహారం కనపడుతోంది. తాము ప్రజాప్రతినిధులమనే సంగతి మర్చిపోయి... ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు వీళ్లు ఎమ్మెల్యేలేనా అనే అనుమానం కలిగే దిగజారి ప్రవర్తించారు. అసెంబ్లీలోనైనా, బయటైనా తమ ప్రవర్తన మారదంటూ నిరూపించుకున్నారు. టీవీల్లో చూసేవాళ్లకి అసలు వీళ్లు ఎమ్మెల్యేలేనా అనే సందేహాలు పుట్టిస్తున్నారు.

 

నిన్న మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్‌ దగ్గర తన్నుకుంటే, ఈసారి మగాళ్ల వంతు వచ్చింది. అగ్రిగోల్డ్‌‌పై వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దాంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. ఆ తర్వాత రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీపై జగన్‌ మాట్లాడేందుకు ప్రయత్నించగా మైక్‌ కట్‌ చేయడంతో మరోసారి వైసీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. దాంతో మరోసారి సభ వాయిదాపడింది.

 

ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మీడియా పాయింట్‌ దగ్గరకొచ్చిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు....  వీధి పోరాటానికి దిగారు. నీళ్ల కోసం కుళాయిల దగ్గర ఆడాళ్లు కొట్టుకున్నట్లు, మందు కోసం వైన్స్‌ షాపుల ముందు మగాళ్లు తోసుకున్నట్లుగా మీడియా పాయింట్‌ దగ్గర మైకుల కోసం ఎమ్మెల్యేలు తిట్టుకున్నారు తన్నుకున్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి..... వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో అసెంబ్లీలోనే కాకుండా, బయట కూడా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంటూ చెవిరెడ్డి ఆరోపించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోనూ, బయటా అరాచకం సృష్టిస్తున్నారని మంత్రి పల్లె మండిపడ్డారు. మొత్తానికి ఏపీ కొత్త అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రచ్చరచ్చ చేస్తున్నారు. తాము ప్రజాప్రతినిధులమనే సంగతి మర్చిపోయి... ఎమ్మెల్యేలు వీధి రౌడీలను తలపిస్తున్నారు.