Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీగా ఏపీ.. చంద్రబాబు
posted on: May 25, 2026 5:00PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంకేతికంగా ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చిప్ నుంచి షిప్ వరకు అనే నినాదంతో నవ్యాంధ్రప్రదేశ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కేవలం భారీ పరిశ్రమలకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఇంటా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే విజయవాడ వేదికగా సోమవారే (మే 25)నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానక ర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు, 45 పారిశ్రామిక క్లస్టర్ల సమగ్ర అభివృద్ధి కోసం రూ. 200 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వినూత్నమైన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఏపీ డీడీపీ ద్వారా రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను నెలకొల్పనున్నారు. ఈ కేంద్రాల స్థాపనతో దాదాపు 1,840 ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరడమే కాకుండా.. 7,500 మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతికతను స్థానిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తెచ్చేందుకు మెటా , అమెజాన్ , జోహో వంటి గ్లోబల్ డిజిటల్ దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రగతి కేవలం మైక్రో లెవెల్ పరిశ్రమలకే పరిమితం కాలేదు.. దేశ భద్రతను శాసించే అడ్వాన్స్‌డ్ మై క్రో టెక్నాలజీ వైపు కూడా అడుగులు వేస్తోంది. ఒకవైపు గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేస్తూనే, మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా రూ. 15,803 కోట్ల భారీ పెట్టుబడితో, 650 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎమ్సీఏ) డిఫెన్స్ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీఓ,హాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా శత్రువుల రాడార్లకు చిక్కని 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆంధ్రప్రదేశ్ గడ్డపైనే తయారు చేయబోతున్నారు. భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్స్ వంటి గ్లోబల్ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడుతుండటంతో రాయలసీమ యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయి.
మరోవైపు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేస్తూ ఏపీని డ్రోన్ క్యాపిటల్‌గా మార్చేందుకు కసరత్తు వేగవంతమైంది. ఇందులో భాగంగా కేవలం రూ. 500 కోట్ల పెట్టుబడితో వచ్చే ప్రాజెక్టుల ద్వారా 2,050 మందికి తక్షణ ఉపాధి లభించనుంది. డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 255 కోట్ల పెట్టుబడితో 850 మందికి, అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 34 కోట్ల పెట్టుబడితో 52 మందికి ఉపాధి కల్పించనున్నాయి.
రాష్ట్రాన్ని మానవ వనరుల హబ్‌గా మార్చేందుకు 35,000 మంది యువతకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. చిప్ డిజైనింగ్, డ్రోన్ టెక్నాలజీ, అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ నుంచి నౌకాశ్రయాల అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ ఏపీ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోతోంది. ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని నవ్యాంధ్రను గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీగా మార్చేందుకు పారిశ్రామికవేత్తలు కదలిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.



.webp)


