ప్రత్యేక హోదా లేకుండా పొరుగు రాష్ట్రాలతో పోటీపడగలమా?

posted on: Feb 19, 2015 8:55AM

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత అక్కడి నుండి బెంగుళూరు వెళ్లి అక్కడ రక్షణ మరియు విమాన రంగాలకి యంత్ర సామాగ్రి తయారుచేసే పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. ఆయన వారికి తన ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు సౌకర్యాల గురించి వివరించి వారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తారు. ఒకవేళ వారిలో ఏ కొందరు సముఖత వ్యక్తం చేసినా రాష్ట్రానికి మరికొన్ని భారీ పరిశ్రమలు వాటితో బాటే అనుబంధ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది.

 

ఇప్పటికే అనేకమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే మరిన్ని పరిశ్రమలు తరలివచ్చేవి. కానీ ఇప్పుడు ఆ హోదా దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా లేకుండా పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడి రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడం కత్తిమీద సామువంటిదే.

google-ad-img
    Related Sigment News
    • Loading...