బంగాళాఖాతంలో మరో వాయుగుండం!.. తెలుగు రాష్ట్రాలకు వానగండం!!

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగపట్టాడా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు.  వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది.  వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రానున్న మూడు రోజులలో తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం ( నవంబర్ 4) బంగాళాఖాతంలో అల్పడీనం ఏర్పడింది. ఇది బలపడి వాయుగుండంగా, తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది  కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu