మరో 24 గంటలు వాయు‘గండమే’
posted on Oct 29, 2025 7:13AM
.webp)
మొంథా తుపాను మంగళవారం (అక్టోబర్ 28) అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో అర్థరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతవరణ శాఖ వెల్లడించింది. కాగా, మొంథా తుపాను ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బుధవారం (అక్టోబర్ 29) కోస్తా ఆంధ్రా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.