Latest News
‘యానిమల్’ మూవీని తెలుగులో మహేష్‌తో చేస్తా: సందీప్‌రెడ్డి
posted on: Nov 27, 2023 4:25PM

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని రూపొందించి తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆ తర్వాత హిందీలో షాహిద్ కపూర్‌తో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని ‘కబీర్‌సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్‌లో కూడా సూపర్‌హిట్ సాధించి దేశంలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా ఎదిగారు సందీప్‌రెడ్డి. తాజాగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన మరో వైల్డ్ మూవీ ‘యానిమల్’. దేశంలోని పలు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు సందీప్‌రెడ్డి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
‘యానిమల్’ చిత్రాన్ని ఒకవేళ తెలుగులోనే చెయ్యాల్సి వస్తే ఎవరితో చేసి ఉండేవారు అని అడిగిన ప్రశ్నకు ‘మహేష్‌బాబుగారితో చేస్తాను’ అంటూ ఠక్కున సమాధానం చెప్పారు సందీప్‌రెడ్డి వంగా. అలాంటి రగ్‌డ్ క్యారెక్టర్‌కి మహేష్ లాంటి హీరో ఎంతవరకు సెట్ అవుతాడో తెలీదుగానీ సందీప్‌రెడ్డి మాత్రం ఆ సినిమా తెలుగులో ఎవరితో చేస్తారు అనగానే మహేష్ పేరు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.






