Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రా అరెస్టు
posted on: Nov 15, 2025 9:47AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను సిట్ అరెస్టు చేసింది. ఈ అనిల్ ఛోఖ్రా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన రూ.77.55 కోట్ల నగదును డొల్ల కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సిట్ పేర్కొంది.
అనిల్ చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్, నైస్‌నా మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో సృష్టించిన ఈ కంపెనీల ఖాతాల్లోకి లిక్కర్ సొమ్మును జమ చేసి, అనంతరం ఆ నిధులను మరో 32 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసి, బ్లాక్ మనీని వైట్ గా మార్చే మార్చే ప్రయత్నం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా ఉండగా
అనిల్ చోఖ్రా గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది. 2017, 2021 సంవత్సరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ చోఖ్రాను మనీలాండరింగ్ కేసుల్లో రెండు సార్లు అరెస్టు చేసినట్లు తెలిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, ఈ అనిల్ చోఖ్రా లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్‌గా మార్చేందుకు మద్యం స్కామ్ నిందితులు ఆయన్ను సంప్రదించినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు సిట్ పేర్కొంది. భారీగా కమీషన్ తీసుకుని మరీ అనీల్ చోఖ్రా ఈ లావాదేవీలకు సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
టెక్నాలజీ సహాయంతో అనిల్ చోఖ్రాపై నిఘా పెట్టిన సిట్ అధికారులు, గురువారం (నవంబర్ 13)న అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రాను 49వ నిందితుడిగా చేర్చిన సిట్ అతడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.






