24న ఏపీ కేబినెట్ భేటీ
posted on: Feb 19, 2026 8:57AM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 24న భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24 మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుందని సీఎస్ విజయానంద్ బుధవారం (ఫిబ్రవరి 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్ లో 23వ తేదీలోగా పంపాలని అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులకు అధికారిక సమాచారం అందజేశారు. ఇలా ఉండగా ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



.webp)



