రాజధానిపై విషప్రచారం నమ్మొద్దు...
posted on: Nov 10, 2014 9:10AM

ఏదైనా విషయంలో అనుమానమొస్తే .. క్లారిటీ ఇవ్వడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. రైతుల భూములను లాక్కుంటున్నారంటూ కొన్ని పార్టీలు అపోహలు క్రియేట్ చేశాయి. భూములు ఇస్తే దానికి సరిపడా ప్రతిఫలం ఇస్తామని చంద్రబాబు సర్కారు కుండబద్దలు కొట్టినా వినకుండా కొందరు విషప్రచారం చేశారు. ఏదో జరిగిపోతుందంటూ బురదజల్లేప్రయత్నం చేశారు. కానీ వాటన్నంటిని చంద్రబాబు పటాపంచలు చేశారు. భూములను కోల్పోయే రైతులు ఏమాత్రం భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా అన్నదాతలకు ఏం చేయాలో అన్ని చేసి చూపిస్తానని మాట ఇచ్చారు.
రాజధానిపై చెప్పుడు మాటలు వినొద్దని చంద్రబాబు సూచించారు. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయే రైతులకు ఏడాదిలోపు ధ్రువపత్రాలిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తానని స్పష్టం చేశారాయన. జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి మంచి ఛాన్సు వస్తుందని... మిస్ చేసుకోవద్దని కూడా అప్పీల్ చేశారు. రాజధాని ప్రాంత రైతులను అన్నివిధాలా పైకి తేవడమే తన సంకల్పమని స్పష్టం చేశారాయన. అంతేకాదు రాజధానికి భూములిచ్చే రైతులకు ఎక్కడో మూల భూమి ఇవ్వకుండా.. మంచి డిమాండ్ ఉన్న చోటే ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతోందట.
నిజానికి రాజధాని ప్రాంత రైతులకు పెద్ద లాభమే కలగనుంది. భూమి కోల్పోయే రైతులకు కొంత భూమితో పాటు పరిహారం.. ఇలా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. రాజధాని రాకతో భూముల విలువ పెరుగుతుంది. దానికి తోడు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తుకు ఢోకా ఉండదు.
రాజధాని అంటే అదేదో ఆషామాషీగా కాకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఛండీగఢ్, ఢిల్లీ నగరాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాగే నయా రాయపూర్ నమూనాపై స్టడీ చేశారు. రాబోయే తరాలు గుర్తుంచునేలా కనివినీ ఎరుగని రీతిలో క్యాపిటల్ సిటీని కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మురికివాడలు లేని... అంతర్జాతీయ నగరాన్ని నిర్మించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా హైఫై రేంజ్ లో ఉండేలా వర్కవుట్ జరుగుతోంది. హైటెక్ సిటీతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీ రాజధానిని కూడా అదేరేంజ్‌లో కట్టబోతున్నారు. రాజధాని నిర్మాణంలో బాబుకు ఉన్న అనుభవం కూడా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.






.webp)



